అమెరికాను వణికిస్తున్న తుఫాన్
తూర్పు అమెరికాను తుఫాను వణికిస్తున్నది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. ప్రమాద ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
వాషింగ్టన్, ఆగస్టు 8: తూర్పు అమెరికాను తుఫాను వణికిస్తున్నది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. ప్రమాద ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వందల విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 11 లక్షలకుపైగా ఇండ్లు, వాణిజ్య కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ నుంచి టెన్నెసీ వరకు 10 రాష్ర్టాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 2.95 కోట్ల మంది టోర్నడోల ముప్పు ఎదుర్కొంటున్నారని వాతావరణ విభాగం తెలిపింది. ‘అత్యంత బలమైన గాలులతో తుఫాన్లు, టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదముంది. ప్రజలు ఇంటి వద్దే ఉండాలి. బయటకు రావొద్దు’ అని హెచ్చరికలు జారీచేసింది. అలబామా, జార్జియా, దక్షిణ కరోలినా, ఉత్తరకరోలినా, మేరీల్యాండ్, డెలావర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, వర్జీనియాలో 11 లక్షల ఇండ్లకు విద్యుత్తు నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

