కరోనా ఎఫెక్ట్.. పదవులు కోల్పోయిన 8 దేశాల ఆరోగ్య మంత్రులు

న్యూఢిల్లీ: కరోనా కోట్లాది మందిని కష్టాల పాలు చేసింది. లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అంతేకాదు రాజకీయ నాయకుల పదవులకు కూడా ఎసరు పెట్టింది. ఈ కరోనా మహమ్మారిని సరిగా నియంత్రించలేక ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల ఆరోగ్య మంత్రులు తమ పదవులు కోల్పోవాల్సి వచ్చింది. 2021లోనే ఇలా 8 దేశాల ఆరోగ్య మంత్రులు రాజీనామా చేయడమో, పదవులు కోల్పోవడమో జరిగింది. ఇండియాలోనూ సెకండ్ వేవ్‌ను సరిగా అంచనా వేయలేక, ఆక్సిజన్, మందుల కొరతను తీర్చలేక మోదీ ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయే దేశాల ఆరోగ్య మంత్రులు ఈ కరోనా కారణంగా తమ పదవులు కోల్పోయారో ఒకసారి చూద్దాం.
మూడు వారాలు కూడా తన పదవిని అనుభవించక ముందే ఈక్వడార్ ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. వ్యాక్సిన్ల విషయంలో తమ వారికి ప్రాధాన్యత ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అక్కడి ఆరోగ్య మంత్రి రొడాల్ఫో ఫర్ఫాన్.. గత మార్చిలో రాజీనామా చేశారు. అంతకు నెల రోజుల ముందే ఆ పదవి నుంచి తప్పుకున్న జువాన్ కార్లోస్‌కు మళ్లీ ఆరోగ్య మంత్రి పదవి కట్టబెట్టడం గమనార్హం. వ్యాక్సినేషన్‌కు సంబంధించే ఆరోపణలు ఎదుర్కొన్న అర్జెంటీనా ఆరోగ్య మంత్రి గినెస్ గొంజాలెజ్ కూడా గత ఫిబ్రవరిలో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇక పని ఎక్కువైపోయింది, ఆరోగ్య మంత్రి పదవిలో కొనసాగడం తన వల్ల కాదంటూ ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రుడాల్ఫ్ ఆన్షోబర్ గత ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. ఇరాక్‌లో ఓ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగి 80 మంది చనిపోవడంతో దానికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య మంత్రి హసన్ అల్-తమిమి రాజీనామా చేశారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు చనిపోవడంతో జోర్డాన్ ఆరోగ్య మంత్రి నజీర్ ఒబీదాత్ను పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాని బిషెర్ అల్ ఖసాన్వే ఆదేశించారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు.
వ్యాక్సిన్లకు సంబంధించిన ఆరోపణలతోనే పదవి కోల్పోయిన మరో ఆరోగ్య మంత్రి పెరుకు చెందిన పిలార్ మాజెట్టి. అసలు వ్యాక్సినేషన్ ప్రారంభించక ముందే దేశ మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్కారాకు వ్యాక్సిన్ వేయడంపై దుమారం రేగింది. దీంతో ఆమె పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. కరోనాను సరిగా నియంత్రించలేకపోయారంటూ స్లొవేకియాలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి మారెక్ క్రాజీని పదవి నుంచి తప్పించారు. అటు మంగోలియాలో కరోనా కారణంగా ఓ తల్లి, అప్పుడే పుట్టిన శిశువు మరణించడంతో గత జనవరిలో అక్కడి ప్రధాని ఖురేల్సుఖ్ ఉఖానాతోపాటు కేబినెట్ మొత్తం రాజీనామా చేశారు. 2020లోనూ ఇలాగే న్యూజిలాండ్, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్లకు చెందిన ఆరోగ్య మంత్రులు కూడా తమ పదవులు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

