24 గంటల్లో 23వేల మొక్కలు నాటేశాడు!
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీరనాటు’.. అనేపాట ఇతడికి అచ్చంగా సరిపోతుంది. కెనడాకు చెందిన రన్నర్, పర్యావరణవేత్త ఆంటోని మోసెస్ (23) కేవలం 24 గంటల్లోనే 23,060 మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించాడు.
ఒట్టావా, నవంబర్ 11: ‘నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీరనాటు’.. అనేపాట ఇతడికి అచ్చంగా సరిపోతుంది. కెనడాకు చెందిన రన్నర్, పర్యావరణవేత్త ఆంటోని మోసెస్ (23) కేవలం 24 గంటల్లోనే 23,060 మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించాడు. కాప్-27లో భాగంగా ప్రపంచస్థాయి నేతలంతా వాతావరణ సవాళ్లను అధిగమించడంపై చర్చిస్తున్న నేపథ్యంలో ఆంటోని మోసెస్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆంటోని మోసెస్ కిందికి వంగి చకచకా గోతులు తవ్వుతూ మొక్కలు నాటుతూ వెళ్తున్నాడు. ఈ ఫీట్‌తో మోసెస్ 24 గంటల్లోనే అత్యధిక మొక్కలు నాటిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు కెనడాకు చెందిన కెన్నీ చాప్లిన్ పేరుపైన ఉందని గిన్నిస్ సంస్థ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Marathoner
- plants
- Saplings
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

