చిలుకలు చూడడానికి భలే ముద్దుగా ఉంటాయి. మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. కొన్ని చిలుకలు మాట్లాడడం కూడా చూస్తుంటాం. అయితే, ఓ చిలుక తన కారు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న వీడియో
నెట్టింట వైరల్గా మారింది. ఈ హృదయపూర్వక వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది.
ఈ వీడియోను ‘క్యూటెస్ట్ బర్డ్’ అనే యూజర్ ఇన్స్టాలో షేర్ చేశారు. దీనికి ‘సూపర్ హీరో’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో చిలుక తెరిచి ఉన్న కారు కిటికీపై కూర్చుని ప్రయాణిస్తుంటుంది. కిటికీవైపు వేగంగా వస్తున్న గాలిని ఆస్వాదిస్తుంటుంది. ఇది సిట్రాన్ కాకాటూ జాతికి చెందిన చిలుక. వీటికి కారు ప్రయాణాలంటే చాలా ఇష్టం. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. ఆ క్షణం చిలుక ఎగురాలనుకున్నా ఎగురలేదు.. అని ఒకరు కామెంట్ చేయగా, అది తనకంటే సజీవంగా జీవిస్తోంది అని మరొకరు వ్యాఖ్యానించారు.