Hamas Big Missile Attack | ఇజ్రాయెల్‌ను మరోసారి టార్గెట్ చేసిన హమాస్.. పెద్ద క్షిపణులతో టెల్ అవీవ్‌పై దాడి
Hamas Big Missile Attack | పాలస్తీనాలోని గాజాపై పట్టున్న హమాస్ మరోసారి ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్‌పై పెద్ద క్షిపణులతో ఆదివారం దాడి చేసింది. హమాస్ సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది.
టెల్ అవీవ్: పాలస్తీనాలోని గాజాపై పట్టున్న హమాస్ మరోసారి ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్‌పై పెద్ద క్షిపణులతో ఆదివారం దాడి చేసింది. (Hamas Big Missile Attack) హమాస్ సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. తమ పౌరులపై జియోనిస్ట్ (ఇజ్రాయెల్) మారణకాండకు ప్రతిస్పందనగా పెద్ద రాకెట్లను ప్రయోగించినట్లు టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచే భారీ క్షిపణులను లాంచ్ చేసినట్లు హమాస్‌కు చెందిన అల్-అక్సా టీవీ పేర్కొంది.
కాగా, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించినట్లు బీబీసీ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ ఈ రాకెట్లను అడ్డుకున్నదని పేర్కొంది. ఇజ్రాయెల్ సెంట్రల్ సిటీ టెల్ అవీవ్, హెర్జ్లియా, పెటా టిక్వాతో సహా పలు నగరాలు, పట్టణాలలో ప్రజలను హెచ్చరించే సైరన్లు మోగాయని వెల్లడించింది.
మరోవైపు హమాస్ తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం జరిగిందో అన్నది వెల్లడి కాలేదు. అయితే ఏడు నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశంపై రాకెట్లను ప్రయోగించే సత్తా తమకు ఉన్నదని హమాస్ తాజా దాడి సూచిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

