Israel-Hamas war | అలా చేస్తే ఇజ్రాయెలీ బందీలను వదిలేందుకు సిద్ధమన్న హమాస్..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది.
Israel-Hamas war | ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది. గాజాలో భూతల దాడులను మరింత తీవ్రంచేస్తామని ప్రకటించింది. దాడులు, ప్రతిదాడులతో వేలాది మంది సాధారణ ప్రజలు బలవుతున్నారు. ఇజ్రాయెల్ ధాటికి ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఈనేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య రాజీ కుదుర్చేందుకు మధ్యప్రాశ్చ్య దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని (Cease Fire), బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలా రాజీకుదిర్చేలా యత్నిస్తున్నాయి. దీనికి హమాస్ వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి (Prisoner Exchange) తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ (Hamas) ప్రకటించింది. ప్రతిగా బందీలుగా ఉన్న పాలస్తీనియన్లు విడిచిపెట్టాలని షరతు విధించింది.
తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను (Israeli hostages) విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా (Abu Obeida) చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ (Palestinian prisoners) విడుదల చేయాలి. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

మరోవైపు గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది. ఉత్తర గాజాలో 150 సొరంగాలు, బంకర్లను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థపై కూడా దాడులు చేయడంతో దాదాపు 23 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొంటామని హమాస్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

