బిల్‌బోర్డ్స్‌లో బ్లూ ఫిల్మ్స్
పలు దేశాల్లో డిజిటల్ ప్రకటనల హోర్డింగ్‌లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకొని వాటిపై సాధారణ ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం కలకలం రేపింది.
- పలు దేశాల్లో హ్యాకింగ్ కలకలం
కైరో, కౌలాలంపూర్: పలు దేశాల్లో డిజిటల్ ప్రకటనల హోర్డింగ్‌లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకొని వాటిపై సాధారణ ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం కలకలం రేపింది. గత నెల 29న ఈజిప్ట్, మలేషియా, బ్రెజిల్, ఇరాక్, చైనాలో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ పరిణామం డిజిటల్ ప్రకటనల వ్యవస్థల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నది. ఈజిప్ట్‌లోని గిజా నగరంలో రద్దీ రహదారిపై ఏర్పాటుచేసిన భారీ ఎలక్ట్రానిక్ హోర్డింగ్‌పై అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి. వాటిని చూసిన వాహనదారులు కొందరు తమ వాహనాలను ఆపి వాటిని వీడియోలు తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈజిప్ట్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఆ హోర్డింగ్‌ను నిర్వహిస్తున్న సంస్థకు ప్రకటనల కంటెంట్‌ను అందించే ఓ అంతర్జాతీయ సంస్థ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. దాని ప్రభావంతో పలు దేశాల్లోని డిజిటల్ తెరలపై అనధికార కంటెంట్ ప్రసారమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. మలేషియాలోని జోహోర్ రాష్ట్రం క్లువాంగ్ పాంతంలో పలు ప్రభుత్వ ఎల్ఈడీ తెరలపై అసభ్యకర కంటెంట్ ప్రసారమైనట్లు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ధ్రువీకరించింది. బ్రెజిల్‌లోని కాంపో మయోర్ ప్రాంతంలోనూ ఓ డిజిటల్ ప్రకటనల తెరపైన అశ్లీల దృశ్యాలు కనిపించాయి.
రెండు గంటల్లోనే వేల వ్యవస్థలను హ్యాక్ చేశాం: లీకర్స్
లీకర్స్ పేరుతో టెలిగ్రామ్ చానల్ నిర్వహిస్తున్న హ్యాకర్ల బృందం ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించింది. ఎల్ఈడీ తెరలకు ప్రకటనల కంటెంట్‌ను పంపించే సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను ఉపయోగించుకొని హ్యాకింగ్‌కు పాల్పడ్డామని పేర్కొన్నది. ఆటోమేటెడ్ స్కానింగ్ ద్వారా కేవలం రెండు గంటల్లోనే వేల సంఖ్యలో బలహీనమైన వ్యవస్థలను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ దాడికి పెద్దగా సాంకేతిక నైపుణ్యం అవసరం లేదని, కనీస భద్రతా చర్యలు పాటించని వ్యవస్థలను సులభంగా ఆధీనంలోకి తీసుకోవచ్చని హ్యాకర్లు వ్యాఖ్యానించారు. అయితే, ఆ గ్రూప్ వారే సైబర్ దాడికి పాల్పడినట్టు ధ్రువీకరణ లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

