ఎదుటివ్యక్తి ఏదైనా ప్రమాదంలో ఉంటే చాలామంది పట్టించుకోరు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. కొందరైతే ఫోన్లో వీడియోలు తీస్తారు తప్ప.. సహాయం చేయరు. కానీ ఓ వ్యక్తి నీళ్లలో పడిపోయిన కుక్క కోసం పెద్ద సాహసమే చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఓ నదిలో కుక్క పడిపోయింది. పెళ్లివేడుకకు వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించాడు. వెంటనే తన కోటు విప్పి గట్టున పెట్టేశాడు. కుక్కను చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. అతడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.