H1B Visa | అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్1బీ వీసాదారులకు టెక్ కంపెనీలు హెచ్చరిక!
అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై హెచ్1బీ వీసాదారులలో అనుమానాలు నెలకొన్నాయి.
- భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్న వలసదార్లు
H1B Visa | వాషింగ్టన్, ఏప్రిల్ 3 : అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై హెచ్1బీ వీసాదారులలో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులను అప్రమత్తం చేస్తూ.. దేశాన్ని వీడొద్దని సూచించాయి. మళ్లీ అమెరికాకు తిరిగిరావడానికి అనుమతి ఉంటుందో?
లేదోననే అనుమానాలు ఉన్నందున.. ఈ హెచ్చరికలు జారీచేస్తున్నట్టు సదరు కంపెనీలు పేర్కొన్నాయి. అమెరికాను వీడొద్దంటూ ఆయా ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇప్పటికే సూచించాయి. దీంతో భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పలువురు హెచ్1 బీ వీసాదార్లు చెప్పినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొన్నది. ఒకవేళ చట్టాన్ని మార్చితే, వలసదార్ల పిల్లల పౌరసత్వం అగమ్యగోచరంగా మారేట్టు ఉందని ఒకరు వాపోయారని వార్తా కథనం తెలిపింది. అమెరికా పౌరులు మినహా, మిగతా అందరూ అక్రమ వలసదారులే అన్న భావన అక్కడ నెలకొని ఉందని భారతీయ వలసదారులు చెబుతున్నారు. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Amazon
- America
- Donald Trump
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

