Marilyn Monroe | న్యూయార్క్: వివాదాస్పదంగా మారిన ప్రఖ్యాత హాలీవుడ్ నటి, మోడల్, గాయని మార్లిన్ మన్రో భారీ విగ్రహాన్ని అమెరికాలోని పామ్ స్ప్రింగ్స్‌లో వేరే ప్రదేశానికి తరలించడానికి ఎట్టకేలకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2014లోనే పామ్స్ప్రింగ్స్ను వదిలి తిరిగి 2021లో అదేచోటుకు చేరుకున్న ఈ భారీ విగ్రహంపై వివాదాలు చుట్టుముట్టాయి. 1955లో వచ్చిన ‘ద సెవెన్ ఇయర్ ఇచ్’ అనే చిత్రంలో మార్లిన్ మన్రో స్కర్ట్ సీన్ చలనచిత్ర రంగంలో ఒక ఐకానిక్ సీన్‌గా నిలిచిపోయింది.
ఆ సీన్లోని స్టిల్‌తో మార్లిన్ మన్రో 26 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్కర్ట్ ఎగిరే సెక్సీ దృశ్యంతో అంత భారీగా ఉన్న విగ్రహాన్ని చూసి మహిళలు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పామ్ స్ప్రింగ్స్ మేయర్ జెఫ్రీ బెర్న్స్టీయిన్ తెలిపారు. అందుకే దానిని దగ్గరలోనే డౌన్‌టౌన్ పార్కులో ఒక నిర్దేశిత ప్రదేశానికి తరలించనున్నట్టు చెప్పారు.