ELECTRONIC NOSE| కార్చిచ్చులను ముందే పసిగట్టే ‘ఎలక్ట్రానిక్ నోస్’
కార్చిచ్చులు.. ప్రస్తుతం అనేక దేశాలకు పెనుసవాలుగా మారాయి. ఈ కార్చిచ్చులను ముందే పసిగట్టి హెచ్చరించే ఎలక్ట్రానిక్ నాసికాలను జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది.
ELECTRONIC NOSE| బెర్లిన్: కార్చిచ్చులు.. ప్రస్తుతం అనేక దేశాలకు పెనుసవాలుగా మారాయి. లక్షల ఎకరాలను బుగ్గిచేస్తూ, వేల జంతువుల ప్రాణాలను హరిస్తూ.. వందల మందిని నిరాశ్రయులను చేస్తున్న కార్చిచ్చులు అనేక దేశాలను వణికిస్తున్నాయి. వరుస కార్చిచ్చులతో కెనడా సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో కార్చిచ్చులను ముందే పసిగట్టి హెచ్చరించే ఎలక్ట్రానిక్ నాసికాలను జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ డ్రయార్డ్ నెట్వర్క్స్ అభివృద్ధి చేసింది. అగ్నికీలలను ప్రాథమిక దశలోనే అదుపులోకి తెచ్చి, పెను విపత్తు సంభవించకుండా చూడటంలో ఇవి ఎంతో దోహదపడుతాయని పరిశోధకులు చెప్తున్నారు.
సౌరశక్తితో నడిచే ఈ పరికరం.. డీజిల్ ట్రక్ నుంచి వెలువడే పొగకు, కార్చిచ్చుకు మధ్య తేడాను గుర్తించగలదని పరిశోధకులు పేర్కొన్నారు. జర్మనీలో తరచూ కార్చిచ్చులు సంభవించే ఈశాన్య బెర్లిన్‌లోని అడవుల్లో వీటిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మంటలు దావానలంలా వ్యాపించడానికి 10-15 నిమిషాల ముందే ఈ సెన్సర్లు గుర్తించి, స్థానిక అధికారులకు సమాచారం చేరవేస్తాయని పరిశోధకులు తెలిపారు. కార్చిచ్చులపై నిఘా కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న కెమెరాల కంటే ఇవి ఎంతో ఉత్తతమని పేర్కొన్నారు. అమెరికా, గ్రీస్, స్పెయిన్‌తో పాటు 10కిపైగా దేశాలు ఈ పరికాలను పరీక్షిస్తున్నాయని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

