బెర్లిన్: జర్మనీకి చెందిన మిలియనీర్ రాదిమ్ పసేర్ తన బుగాటి కారును వేగంగా నడిపాడు. గంటకు 417 కిలోమీటర్ల వేగంతో బుగాటి సూపర్ కార్‌ను నడిపట్లు ఓ వీడియో రిలీజైంది. ఈ ఘటనలో అతనికి రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. బుగాటి చిరాన్ కారును అతను డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 10 మిలియన్ల పౌండ్లు ఖరీదైన ఆ కారుతో అక్రమ రీతిలో రేస్‌లో పాల్గొన్నట్లు రాదిమ్పై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లలో బుగాటి చిరాన్ అత్యంత వేగవంతమైంది. స్పీడోమీటర్‌లో ఆ కారు 417 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది.బెర్లిన్, హన్నోవర్ మధ్య ఉన్న రూట్లో ఆ కారు ప్రయాణించినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. 1500 హార్స్ఫవర్ ఇంజిన్‌తో బుగాటి చిరాన్ గంటకు 420 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.