Operation Midnight Hammer | ఇరాన్‌లోని మూడు కీలకమైన అణుకేంద్రాలపై అమెరికా ఆదివారం తెల్లవారు జామున విరుచుకుపడింది. ఈ మిషన్‌కు ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పేరు పెట్టినట్లుగా పెంటగాన్ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 125పైగా యూఎస్ యుద్ధ విమానాలు, మిస్సైల్స్ పాల్గొన్నాయని చెప్పింది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ పౌరులకు హాని జరుగకుండా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. బాంబర్లు, ఫైటర్ జెట్లు, ట్యాంకర్లు, నిఘా విమానాలు సహా 125పైకిగా అమెరికన్ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రత, శాంతిని కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి పీట్ హాగ్సేత్ పేర్కొన్నారు.
#WATCH | US Secretary of Defence Pete Hegseth says “Last night, on President Trump’s orders, US Central Command conducted a precision strike in the middle of the night against three nuclear facilities in Iran, Fordow, Natanz, and Isfahan, in order to destroy or severely degrade… pic.twitter.com/TRsA6mdNgU
— ANI (@ANI) June 22, 2025
ఇరాన్ శాంతి మార్గాన్ని అవలంబించకపోతే, అమెరికా మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని హెచ్చరించారు. ఇరానియన్ సైనికులు, ఇరానియన్ ప్రజలను లక్ష్యంగా దాడులు చేయలేదని స్పష్టం చేశారు. రాత్రి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ అర్ధరాత్రి మూడు ఇరానియన్ అణు స్థావరాలు, ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఖచ్చితమైన దాడి చేసిందని.. ఇది అద్భుతమైన విజయమన్నారు. మా కమాండర్ ఇన్ చీఫ్ నుంచి అందిన ఆదేశాల మేరకు అణుకేంద్రాలను నాశనం చేసినట్లు తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రణాళిక ధైర్యంగా, అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అధ్యక్షుడు శాంతి గురించి మాట్లాడితే చర్చల కోసం 60 రోజులు సమయం ఇస్తారని.. కానీ, ఆ తర్వాత ఇరాన్ అణుకార్యక్రమం మనుగడ సాగించదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ తయారీలో ఇజ్రాయెల్ సైతం కీలకపాత్ర పోషించిందని పీట్ హెగ్సేత్ తెలిపారు. చరిత్రలో తొలిసారిగా ఈ ఆపరేషన్‌లో ఎంవోపీ వంటి భారీ బాంబులను ఉపయోగించినట్లు తెలిపారు.
#WATCH | US Secretary of Defence, Pete Hegseth says “The operation President Trump planned was bold and it was brilliant. Showing the world that American deterrence is back. When this President speaks, the world should listen, and the US Military, we can back it up. The most… pic.twitter.com/5MCpSKiXj4
— ANI (@ANI) June 22, 2025
ఈ బాంబులు 30వేల బరువు ఉంటాయని.. వాటికి భూగర్భ బంకర్లను నాశనం చేయగలవన్నారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ మాట్లాడుతూ.. ఈ దాడి యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ ఎరిక్ కురిల్లా నాయకత్వంలో జరిగిందని తెలిపారు. ఈ మిషన్ అమెరికా శక్తి, ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మొత్తం ప్రణాళిక చాలా గోప్యంగా ఉందని.. వాషింగ్టన్లో కొద్దిమందికి మాత్రమే దీని గురించి తెలుసునన్నారు. శుక్రవారం అర్ధరాత్రి అమెరికా నేల నుంచి ఏడు బీ-2 స్పిరిట్ బాంబర్లు టేకాఫ్ అయ్యాయని.. ఈ విమానాలలో కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా పసిఫిక్ మహాసముద్రం వైపు పంపారని.. దాంతో ఇరాన్ గందరగోళానికి గురైందన్నారు. ఆ తర్వాత తూర్పు నుంచి నిశ్శబ్దంగా ఇరాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించాయన్నారు. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించే కొద్దిసేపటి ముందు, యూఎస్ జలాంతర్గామి ఇస్ఫహాన్‌పై టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని రక్షణ మంత్రి హెగ్సేత్ అన్నారు.
#WATCH | US Secretary of Defence Pete Hegseth says “I want to give recognition to our allies in Israel as well. This is a plan that took months and weeks of positioning and preparation so that we could be ready when the POTUS called. It took a great deal of precision. It involved… pic.twitter.com/bcSlVpsS7O
— ANI (@ANI) June 22, 2025
ఇరాన్ ఉపరితల రాడార్, క్షిపణి వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ దాడులు జరిగాయన్నారు. ఈ దాడిలో నాలుగు, ఐదోతరం యుద్ధ విమానాలు ముందుకు సాగుత ముప్పును తొలగించి మార్గాన్ని సిద్ధం చేశాయని చెప్పారు. యూఎస్ స్పేస్ కమాండ్, యూఎస్ సైబర్ కమాండ్, యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్, యూరోపియన్ కమాండ్ వంటి అనేక ప్రధాన సైనిక విభాగాలు ఈ ఆపరేషన్‌లో కలిసిశాయన్నారు. 18గంటల పాటు విమాన ప్రయాణం, గాలిలోనే అనేకసార్లు ఇంధనం నింపడం.. ఇలా ఖచ్చితమైన దాడి చేయడం ప్రపంచంలో మరే ఇతర సైన్యం ఇవన్నీ చేయలేవన్నారు. దాడి చాలా రహస్యంగానే జరిగిందని.. ఇరాన్ రక్షణ వ్యవస్థకు దాడి జరుగుతోందని కూడా తెలియదని చెప్పారు. అమెరికా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగిందనే సమాచారం లేదని, ఇరాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకోలేదని ఆయన చెప్పారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ, సవాల్ చేస్తే వెనక్కి తగ్గమన్నారు. అమెరికా యుద్ధాన్ని కోరుకోవడం లేదని, పౌరులు, మిత్రదేశాల ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే వెంటనే చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
#WATCH | Chairman of the Joint Chiefs of Staff, General Dan Caine says “Last night, on the President’s orders, US Central Command, under the command of General Erik Kurilla, executed Operation Midnight Hammer, a deliberate and precise strike against three Iranian nuclear… pic.twitter.com/CVgNCHA8g4
— ANI (@ANI) June 22, 2025