అబుజా: ఒక ఊళ్లో వివిధ భాషలు మాట్లాడేవారుండటం సాధారణమే. అయితే ఊళ్లోని మహిళలందరూ ఒక భాష, పురుషులు మరో భాష మాట్లాడటమంటే విచిత్రమే కదా. ఈ వింత సౌత్ నైజీరియాలోని ఓ గ్రామంలో కొనసాగుతున్నది. ఆ ఊరిలో ఉబాంగ్ అనే తెగ వాళ్లు రెండు భాషలు మాట్లాడటం ఆనవాయితీ. ఊళ్లోని చిన్నపిల్లలు (బాలికలు, బాలురు) పదేండ్ల వయసు వచ్చే వరకు తల్లి భాషను మాట్లాడినా పట్టించుకోరు. కానీ.. పదేండ్లు దాటిన బాలురు తల్లి భాషను కాకుండా తండ్రి భాషను నేర్చుకోవాలి. అలాకాకుండా మహిళల భాషను ఆ అబ్బాయి మాట్లాడితే వింతగా చూస్తారు.