అణు దాడికి దిగితే తీవ్ర పరిణామాలు : రష్యాకు జీ7 వార్నింగ్!
ఉక్రెయిన్‌పై రష్యా దమనకాండకు పుతిన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ జీ7 దేశాధినేతలు వర్చువల్ భేటీలో రష్యాకు వార్నింగ్ ఇచ్చారు.
మాస్కో : ఐక్యరాజ్యసమితి వారిస్తున్నా ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపించడం పట్ల జీ7 దేశాలు మండిపడ్డాయి. ఉక్రెయిన్‌పై రష్యా దమనకాండకు పుతిన్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ జీ7 దేశాధినేతలు వర్చువల్ భేటీలో రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా అణ్వాయుధాలు వాడితే తీవ్ర పరిణామాలు తప్పవని జీ7 హెచ్చరించింది.
రష్యా మిసైల్ దాడులను ఖండించిన జీ7 ఉక్రెయిన్‌కు తక్షణ సైనిక, రక్షణ అవసరాలు, సామాగ్రిని చేరవేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ అవసరాలను తీర్చేందుకు తాము కట్టుబడిఉన్నామని సంయుక్త ప్రకటనలో జీ7 స్పష్టం చేసింది. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ సామర్ధ్యాలను కల్పించాలని జీ7 దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్ధించారు. మాస్కోపై కఠిన తాజా ఆంక్షలు విధించాలని జీ7 సమావేశంలో జెలెన్స్కీ కోరారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని తోసిపుచ్చారు. ఇక రష్యా ఎలాంటి రసాయన, జీవ, అణ్వాయుధరాలను వాడినా తీవ్ర పరిణామాలు తప్పవని రష్యాను హెచ్చరిస్తున్నామని జీ7 ప్రకటన పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆర్ధిక, సైనిక, దౌత్య, న్యాయ సాయం అవసరమైనా అందించేందుకు ఆ దేశానికి బాసటగా నిలిచేందుకు సిద్ధమని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

