Joe Biden | బైడెన్‌కి మళ్లీ కొవిడ్ నెగటివే.. జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారు : వైట్ హౌస్
Joe Biden | జీ20 సమ్మిట్ (G20 Summit)కు ముందు అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ( Jill Biden)కు కరోనా వైరస్ (Corona Virus) పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అయితే, అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కి మాత్రం నెగటివ్ వచ్చింది. భార్యకు పాజిటివ్ రావడంతో అధ్యక్షుడు ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై తాజాగా వైట్ హౌస్ (White House) స్పష్టతనిచ్చింది.
Joe Biden | జీ20 సమ్మిట్ (G20 Summit)కు ముందు అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ( Jill Biden)కు కరోనా వైరస్ (Corona Virus) పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అయితే, అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కి మాత్రం నెగటివ్ వచ్చింది. భార్యకు పాజిటివ్ రావడంతో అధ్యక్షుడు ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై తాజాగా వైట్ హౌస్ (White House) స్పష్టతనిచ్చింది. జిల్ బైడెన్‌కు పాజిటివ్ తేలడంతో అధ్యక్షుడికి సోమవారం, మంగళవారం వరుసగా కొవిడ్ టెస్ట్ నిర్వహించగా.. రెండు సార్లూ నెగటివ్ వచ్చినట్లు వెల్లడించింది. దీంతో బైడెన్ గురువారం ఢిల్లీ బయలుదేరనున్నట్లు తెలిపింది.
‘జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు అధ్యక్షుడు బైడెన్ గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత శని, ఆదివారాల్లో జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు’ అని యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు.
కాగా, అధ్యక్షుడు బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ గత కొన్ని రోజుల నుంచి స్వల్ప స్థాయిలో కొవిడ్ లక్షణాలతో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం దిలావర్లోని రిహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఆమె గడుపుతున్నారు.
జిల్కు పాజిటివ్ తేలడంతో 80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్‌కు సోమవారం కొవిడ్ పరీక్ష చేపట్టారు. ఆ పరీక్షలో ఆయన నెగటివ్‌గా తేలినట్లు వైట్‌హౌస్ తెలిపింది. నిరంతరం ఆయనకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి బైడెన్‌కు పరీక్షలు చేయగా.. అందులోనూ నెగటివ్ అనే వచ్చింది. దీంతో ఆయన భారత్ పర్యటనకు రాబోతున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు బైడెన్ సహా పర్యటనకు వచ్చే అధికారులందరికీ మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అధ్యక్షుడు బైడెన్ భారత్ పర్యటకు రావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇటీవల అమెరికాలో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాల నుంచి హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Also Read..
Parineeti-Raghav Chadha | పరిణీతి-రాఘవ్ చద్దా పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Uttar Pradesh | పెళ్లి కుమార్తె కోసం పూజలు.. ఫలించకపోవడంతో శివలింగాన్ని అపహరించిన యువకుడు
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్.. ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

