Uttar Pradesh | ఎన్ని పూజలు చేసినా పెళ్లి కావట్లేదని శివలింగాన్ని అపహరించాడు.. అసలేం జరిగింది?
Uttar Pradesh | ఓ యువకుడు తనకు పెళ్లి కావాలని ఎన్నో పూజలు చేశాడు. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ కోరిక ఫలించలేదు. దీంతో తనకు పెళ్లి కుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే అపహరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో వెలుగు చూసింది.
Uttar Pradesh | ఓ యువకుడు తనకు పెళ్లి కావాలని ఎన్నో పూజలు చేశాడు. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ కోరిక ఫలించలేదు. దీంతో తనకు పెళ్లి కుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే అపహరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో వెలుగు చూసింది.
కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువకుడు ప్రతి రోజు స్థానికంగా ఉన్న భైరవ బాబా టెంపుల్‌కు వెళ్లేవాడు. తనకు త్వరగా పెళ్లి కావాలని, మంచి అమ్మాయి దొరకాలని దేవుడిని చోటూ ప్రార్థించేవాడు. అలా కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశాడు చోటూ. చివరకు అమ్మాయి దొరక్కపోవడంతో.. అసహనానికి గురైన చోటూ ఆగస్టు 31న శివలింగాన్ని అపహరించాడు.
అయితే శివలింగం కనిపించకపోవడంతో మిగతా భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. భక్తులను విచారించారు. చోటూ అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు. తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ, అమ్మాయి దొరక్కపోవడంతోనే విసుగు చెంది శివలింగాన్ని అపహరించినట్లు తెలిపాడు చోటూ. ఆలయానికి సమీపంలో చెట్ల పొదల్లో దాచిపెట్టిన శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

