Parineeti-Raghav Chadha | పరిణీతి-రాఘవ్ చద్దా పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Parineeti-Raghav Chadha | బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
Parineeti-Raghav Chadha | బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ నెలలోనే (సెప్టెంబర్) రాఘవ్-పరిణీతిల పరిణయం ఉంటుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో వీరి వివాహం జరగనుంది. పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకలు ఈనెల 17 నుంచే ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘పెళ్లి వేడుకకు సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. పెళ్లికి వచ్చే అతిథులు, వీఐపీల కోసం ఉదయ్ పూర్లో విలాసవంతమైన హోటళ్లను బుక్ చేశారు. ఇది గ్రాండ్ పంజాబీ వెడ్డింగ్. ఈ వేడుక సెప్టెంబర్ 24న ముగుస్తుంది’ అని తెలిపాయి. హల్దీ, మెహందీ, సంగీత్ సహా వివాహాది కార్యక్రమాలు సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయి. పెళ్లి తర్వాత హర్యానాలోని గురుగ్రామ్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
ఈ పెళ్లికి 200 మందికిపైగా అతిథులు, 50 మందికిపైగా వీవీఐపీలు హాజరుకానున్నట్లు సమాచారం. దీంతో వీవీఐపీ అతిథుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ అధికారులు అతిథుల కోసం బుక్ చేసిన హోటళ్లలో తనిఖీలు చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రెండు నెలల క్రితమే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉదయ్‌పూర్ వెళ్లి హోటళ్లను పరిశీలించినట్లు తెలిసింది. ఈ వివాహానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవాకాశం ఉంది. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకకు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో ఈనెల 13వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చాలారోజులు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. ఓ హోటల్ డిన్నర్ డేట్‌కు వచ్చిన సమయంలో ఇద్దరు ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చదివారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. చివరకు పెళ్లిబంధంతో ఒకటికాబోతున్నారు.
Also Read..
India G20 Summit | జీ-20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
Sunil Gavaskar | సూపర్ 4 మ్యాచ్.. మిడిల్ ఆర్డర్లో ఆ ఇద్దరి మధ్యే పోటీ : భారత దిగ్గజం
Fancy Number | 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.9,99,999.. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

