300 మంది రోగులపై అఘాయిత్యం
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ సర్జన్.. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డాడు. 299 మంది రోగులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో అత్యధిక మంది చిన్నారులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫ్రాన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏండ్ల జోయెల్ లి స్కౌర్నెక్.. కోర్టులో నేరాన్ని అంగీకరించాడు.
- అందులో అత్యధికులు బాలబాలికలే
- ఫ్రాన్స్‌లో క్రూర నేరాలకు పాల్పడ్డ సర్జన్
పారిస్ : పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ సర్జన్.. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డాడు. 299 మంది రోగులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో అత్యధిక మంది చిన్నారులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫ్రాన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏండ్ల జోయెల్ లి స్కౌర్నెక్.. కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. సోమవారం ఈ కేసులో కోర్టు విచారణ సందర్భంగా అతడు మాట్లాడుతూ, ‘అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడ్డా. ఎంతోమందిని లైంగికంగా వేధించా. అత్యాచారానికి పాల్పడ్డా. చేసిన తప్పులకు బాధ్యత వహిస్తున్నా’ అని అన్నాడు. ఈ కేసులో న్యాయస్థానం 2020లో జోయెల్‌ను దోషిగా తేల్చి, 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. న్యాయస్థానం అతడికి మరో 20 ఏండ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. 1989 నుంచి 2014 వరకు 299 మందిపై అత్యాచారానికి పాల్పడినట్టు అతడు కోర్టుకు తెలిపాడు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాడు. జోయెల్ మానసికంగా విపరీత ఆలోచనా ధోరణి కలిగిన ‘మేజర్ పర్వర్ట్’గా వైద్యులు తేల్చారు. నిందితుడు జోయెల్ ఫ్రాన్స్‌లోని ఓ దవాఖానలో సర్జన్‌గా పనిచేసేవాడు. రోగులు మత్తులో ఉండగా లైంగికదాడి జరిపినట్టు తెలిపాడు. అతడి ఇంట్లో సోదాలు జరుపగా మూడు లక్షలకుపైగా ఫొటోలు, 650 వరకు అశ్లీల వీడియోలు బయటపడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

