ఇక బహిరంగ ప్రదేశాల్లో అక్కడ మాస్కులు అవసరం లేదు!

పారిస్ : బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను ఈనెల 17 నుంచి తొలగిస్తున్నట్టు ఫ్రాన్స్ బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కావడంతో ఈనెల 20 నుంచి కరోనా కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని మినహాయింపులతో గురువారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలనే నిబంధనను ఎత్తివేస్తున్నామని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు.
దేశంలో ఆరోగ్య పరిస్థితి తాము ఆశించినదాని కంటే వేగంగా మెరుగవుతోందని కాస్టెక్స్ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసమ్మర్థ ప్రదేశాలు, స్టేడియంలు వంటి ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో మాత్రం మాస్క్ లు ధరించాలని చెప్పారు. ఫ్రాన్స్ లో మంగళవారం రోజువారీ సగటు కేసులు అత్యంత కనిష్టంగా 3200గా నమోదయ్యాయి. 2020 ఆగస్ట్ తర్వాత కరోనా కేసులు ఈ స్థాయిలో దిగిరావడం ఇదే తొలిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Face Masks
- France
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

