ఫ్రాన్స్‌లో నిరసనల వెల్లువ లక్షలాది మంది భారీ మార్చ్
పాఠశాలల నిధులు, విపరీతంగా పెరిగిన జీవన వ్యయం తదితర సమస్యలపై ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌తోపాటు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు శనివారం రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపారు.
ప్యారిస్: పాఠశాలల నిధులు, విపరీతంగా పెరిగిన జీవన వ్యయం తదితర సమస్యలపై ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌తోపాటు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు శనివారం రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపారు. గత నెలలో ఉపాధ్యాయుల కొరతతో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు, కార్మికులను కలుపుకుని పెద్ద ఉద్యమంలా మారింది.
విద్యారంగంలో సంస్కరణలు, ఎక్కువ వేతనాలు, పెన్షన్ల పెంపు కోసం ప్రజలు డిమాండ్ చేస్తుండగా, ఉపాధ్యాయుల కొరత వల్ల పాఠశాలల్లో బోధనా గంటలు భారీగా వృథా అవుతున్నాయని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
గతవారాంతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70,000 మంది పోలీసులను మోహరించింది. నిరసనకారులను అణచివేసేందుకు ప్యారిస్‌తో పాటు లియోన్, స్ట్రాస్బోర్గ్, తదితర నగరాల్లో పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. దేశవ్యాప్తంగా 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

