WWI Artillery Shell | ఓ వృద్ధుడు తన శృంగార కోరికలను అణుచుకోలేకపోయాడు. ఆ అనుభూతి పొందాలనుకున్నాడు. కోరికలు శృతి మించడంతో.. ఆ వృద్ధుడు వికృత చర్యకు పాల్పడ్డాడు. ఓ ఫిరంగి గుండును తన పురీషనాళంలో చొప్పించుకుని, నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో వెలుగు చూసింది.
ఫ్రాన్స్‌కు చెందిన 88 ఏండ్ల వృద్ధుడు ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. తనకు శృంగార కోరికలు కలగడంతో.. వాటిని కంట్రోల్ చేసేందుకు వికృత చర్యకు పాల్పడ్డాడు. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన 8 ఇంచుల ఫిరంగి గుండును తన పురీషనాళంలో చొప్పించుకున్నాడు. దీంతో తీవ్ర నొప్పికి గురైన ఆ ముసలాయన.. చేసేదేమీ లేక ముస్సేలోని ఓ ఆస్పత్రికి డిసెంబర్ 17న వెళ్లాడు.
రాత్రి 9 గంటల నుంచి 11:30 గంటల మధ్య ఆ వృద్ధుడికి శస్త్ర చికిత్స నిర్వహించి ఫిరంగి గుండును తొలగించారు వైద్యులు. ఇక సర్జరీ చేస్తున్న సమయంలో ఆ బాంబు పేలితే కష్టమని భావించిన వైద్యులు, ముందస్తు జాగ్రత్తగా బాంబు డిస్పోజబుల్ సిబ్బందిని ఆస్పత్రికి పిలిపించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆ ఫిరంగి గుండును నిర్వీర్యం చేశారు. అయితే మానవ శరీరంలో ఉన్నసమయంలో బాంబు పేలేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వృద్ధుడు చేసిన పనికి అటు వైద్యులు, ఇటు పోలీసులు షాక్ అయ్యారు.