Sherika De Armas | మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ (Sherika De Armas) చిన్నవయస్సులోని మరణించారు. 26 ఏండ్ల షెరికా.. గర్భాశయ క్యాన్సర్‌తో (Cervical Cancer) బాధపడుతున్నారు. 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో (Miss World Competition) పాల్గొన్న ఆమె ఉరుగ్వేకు (Uruguay) ప్రాతినిధ్యం వహించారు. గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె కీయోథెరపీ, రేడియో థెరపీలు చేయించుకున్నప్పటీ ఫలితం దక్కలేదు. షెరికా మరణాన్ని ఆమె సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2015లో ఆమె మిస్ ఉరుగ్వే కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచం కోసం షెరికా చాలా చేశారు, నా జీవితంలో కలుసుకున్న అత్యంత అందమైన మహిళల్లో ఆమె ఒకరు అంటూ ఉరుగ్వే మిస్ యూనివర్స్-2022 కార్లా రొమెరో విచారణం వ్యక్తంచేశారు.
2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా షెరికా మాట్లాడుతూ.. బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా.. క్యాట్‌వాక్ మోడల్ అయినా తానెప్పుడూ మోడల్‌గా ఉంటానికే ఇష్టపడతానని చెప్పారు. ఫ్యాషన్‌కు సంబంధించిన ప్రతీదీ తనకు ఇష్టమనేనని వెల్లడించారు.