అంటార్కిటికా: తూర్పు అంటార్కిటికాలో భారీ మంచు గడ్డ కుప్పకూలింది. ఈ ఘటన ఇటీవల చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆందోళనకరమైన అంశమని అన్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. బౌమన్ దీవులకు సమీపంలో ఉన్న సీ-37 మంచు ఫలకం ఊడిపోయినట్లు గమనించారు. న్యూయార్క్ నగరం సైజులో ఉండే ఆ మంచుగడ్డ కుప్పకూలడం ఆందోళన కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. నిజానికి తూర్పు అంటార్కిటికా ప్రాంతం గ్లోబల్ వార్మింగ్ ప్రభావానికి లోనుకాదని తొలుత భావించారు. అయితే వారం క్రితం భారీ ఐస్ ముక్క కూలడం శాస్త్రవేత్తలను విస్మయపరిచింది. తీవ్రమైన శీతల ప్రదేశంలో ఉండే మంచు గడ్డ కూలిన ఘటనకు చెందిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. అతిశీతల ప్రదేశంలో మంచుగడ్డ ధ్వంసం కావడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన వారం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అయ్యాయని, తూర్పు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు చెప్పారు.