ఆదివారం 24 మే 2020
International - Feb 01, 2020 , 01:32:34

దుబాయ్ తీరంలో ట్యాంకర్‌లో ఫైర్

దుబాయ్ తీరంలో ట్యాంకర్‌లో ఫైర్

ఇద్దరు భారత నావికులు మృతి

దుబాయి, జనవరి 31: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కోస్తా తీరం నుంచి పనామాకు బయలుదేరిన ట్యాంకర్‌లో అగ్ని ప్రమాదం సంభవించడతో ఇద్దరు భారతీయ నావికులు మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పలువురి ఆచూకీ గల్లంతైంది. యూఏఈ కోస్తా తీరానికి 21 మైళ్ల దూరంలో బుధవారం ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని ది ఫెడరల్ అథారిటీ ఫర్ ల్యాండ్ అండ్ మారిటైమ్ ట్రాన్స్‌పోర్ట్ (ఎఫ్‌టీఏ) తెలిపింది. సమాచారం తెలిసిన వెంటనే అగ్ని మాపక దళాలు మంటలను ఆర్పివేసినట్లు శుక్రవారం మీడియాలో వార్తలొచ్చాయి. అదృశ్యమైన వారి కోసం గాలిస్తున్నట్లు ఎఫ్‌టీఏ పేర్కొంది. ప్రమాద సమయంలో ట్యాంకర్‌పై 12 మంది నావికులతోపాటు 55 మంది ప్రయాణిస్తున్నారు. ఆచూకీ గల్లంతైన వారిలో 10 మంది భారతీయులు ఉన్నారు.logo