హెల్సింకి: ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ డ్రగ్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. డ్రగ్ పరీక్షలో ఆమె నెగటివ్ తేలారు. ఇటీవల ఫ్రెండ్స్‌తో ఓ పార్టీలో పాల్గొన్న ఆమె ఫుల్ డ్యాన్స్ చేశారు. అయితే ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో ఆమె పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు మారిన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మారిన్ డ్రగ్ పరీక్ష చేయించుకున్నారు. రిజల్ట్ నెగటివ్ రావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రెండ్స్‌తో జరిగిన పార్టీకి చెందిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ కావడం పట్ల మారిన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2019 డిసెంబర్లో ఫిన్‌ల్యాండ్ ప్రధానిగా సన్నా మారిన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.