Fake Vaccine : నకిలీ వ్యాక్సిన్ల గుర్తింపు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
Fake Vaccine : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు నకిలీలు కూడా ముంచెత్తుతున్నాయి. నకిలీ కోవ్‌షీల్డ్ వ్యాక్సిన్లను భారతదేశం, ఉగాండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. ఈ నకిలీ వ్యాక్సిన్‌ను...

లండన్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు నకిలీలు కూడా ముంచెత్తుతున్నాయి. నకిలీ కోవ్‌షీల్డ్ వ్యాక్సిన్లను (Fake Vaccine) భారతదేశం, ఉగాండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. ఈ నకిలీ వ్యాక్సిన్‌ను అధీకృత వ్యాక్సిన్ సెంటర్ నుంచి తీసుకువెళ్లి పలువురికి ఇచ్చినట్లు తేలింది. 5 ఎంఎల్, 2 ఎంఎల్ వయల్స్ 10 డోసులు నకిలీవిగా తేలాయి. నకిలీ కోవ్‌షీల్డ్ బయటపడటంతో వైద్య ఉత్పత్తుల గురించి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక జారీ చేసింది. తమ కంపెనీ 2 ఎంఎల్ వయల్‌లో కోవ్‌షీల్డ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం లేదని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. జాబితాలో పేర్కొన్న వ్యాక్సిన్ నకిలీదని సీరం ఇన్స్టిట్యూట్ నిర్ధారించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఒకవేళ నకిలీ కరోనా వ్యాక్సిన్‌ను గుర్తించినట్లయితే వెంటనే నాశనం చేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. నకిలీ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి ప్రధాన ముప్పు అని పేర్కొన్నది.డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్ సిస్టం నకిలీ వ్యాక్సిన్లను గుర్తించింది. ఉగాండాలో దొరికిన నకిలీ కోవ్‌షీల్డ్ వయల్‌లో 5 మిల్లీలీటర్ల 10 డోసులు ఉన్నాయి. దీనిపై బ్యాచ్ నంబర్ 4121Z040, గడువు తేదీ ఆగస్టు 10 అని వ్రాయబడింది. ఇవి కూడా నకిలీయే అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఫైజర్ నకిలీ వ్యాక్సిన్ కూడా దొరికింది..
నకిలీ కరోనా వ్యాక్సిన్ గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, అమెరికాలో ఫైజర్-బయో ఎంటెక్ నకిలీ కరోనా వ్యాక్సిన్ గురించి డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అయితే కోవ్‌షీల్డ్ నకిలీ వ్యాక్సిన్ గురించిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ ఈ ఏడాది జూలై-ఆగస్టులోనే పొందింది.
ఇవి కూడా చదవండి..
ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్.. అద్భుతం!
చట్టసభలకు అంతరాయం కలుగకుండా చూడాలి : వెంకయ్యనాయుడు
ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
త్వరలో మళ్లీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
ఆఫ్ఘాన్‌ను తాలిబాన్ ఆక్రమించుకోవడం సబబే: సజ్జాద్ నోమాని
ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు..
నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

