Iran : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేసింది. ఖర్గ్ ఐలాండ్ వద్ద ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా మిస్సైల్ దాడి చేసింది. ఇరాన్ తీరానికి ఖర్గ్ ఐలాండ్ 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ నుంచి చమురు రవాణాకు ఈ దీవి చాలా కీలకం. ఇక్కడినుంచే క్రూడాయిల్‌ను ఇరాన్.. విదేశాలకు తరలిస్తుంది.
అందుకే, అమెరికా.. ఈ దీవిని లక్ష్యంగా ఎంచుకుని దాడి చేస్తోంది. ఇరాన్‌పై దాడి చేస్తామని శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లోని పిక్కేక్స్ పర్వత ప్రాంతంలో ఉన్న భూగర్భ అణు కేంద్రంపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా నిరోధించాలనేదే తమ లక్ష్యమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని గంటల్లోనే ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా నాలుగు మిస్సైళ్లతో దాడి చేసింది. ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి.
తాజా దాడికి సంబంధించి జరిగిన నష్టంపై ఎలాంటి ప్రకటనా రాలేదు. అటు అమెరికా.. ఇటు ఇరాన్.. ఈ దాడిపై ఇంకా స్పందించలేదు. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అలి తాహెర్ ప్రాంతాన్ని ‘ఆపరేషన్ కంట్రోల్’ ద్వారా అధీనంలోకి తెచ్చుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాకు చెందిన భూగర్భ స్థావరాలు, ఆయుధ భాండాగారం వంటివి ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.