టునిస్, ఏప్రిల్ 16: 750 టన్నుల డీజిల్‌తో వెళ్తున్న ఓ నౌక ట్యునీషియా తీరంలో శనివారం మునిగిపోయింది. ఈజిప్టు నుంచి మాల్టా వెళ్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా ట్యునీషియా తీర సమీపంలోని గల్ఫ్ ఆఫ్ గేబ్స్ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనపై స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఓడ నుంచి లీకేజ్ లేదని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై విపత్తు నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అయితే లీకేజ్ ప్రమాదం పొంచివున్నదని, అదేగనుక జరిగితే సముద్ర పర్యావరణ విపత్తుకు దారితీసే అవకాశం ఉందని ట్యునీషియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.