Elon Musk: డోనాల్డ్ ట్రంప్ పార్టీకి మస్క్ భారీ విరాళం
Elon Musk: ట్రంప్ పార్టీకి మస్క్ సపోర్టు ఇస్తున్నారు. ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న సంస్థకు మస్క్ భారీ విరాళం ఇచ్చారు. ఆ విరాళానికి చెందిన పూర్తి డిటేల్స్ ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.
వాషింగ్టన్: అమెరికా బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk).. డోనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ట్రంప్ పోటీలో ఉండనున్నారు. అయితే ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా ప్యాక్ అనే కంపెనీకి మస్క్ భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేయనున్న బైడెన్‌పై మస్క్ ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ కోసం పనిచేసే అమెరికా ప్యాక్ సంస్థకు మస్క్ ఎంత ఇచ్చారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఆ సంస్థ మాత్రం ఈనెల లోనే డోనార్ల జాబితాను రిలీజ్ చేయనున్నది.
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా వచ్చే వారం డోనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మస్క్‌తో పాటు ఇతర సంపన్న దాతలను ఇటీవల ట్రంప్ కలుసుకున్నారు. సుమారు 263 బిలియన్ల డాలర్ల ఆస్తులు ఉన్న మస్క్ తొలుత రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆయన రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. తన సోషల్ మీడియా ఎక్స్‌లో డెమోక్రాట్లకు వ్యతిరేకంగా ఎప్పుడూ కామెంట్ చేస్తూనే ఉన్నారు. నిజానికి పబ్లిక్‌గా ఎవరికి సపోర్ట్ ఇస్తారన్న విషయాన్ని మస్క్ క్లారిటీగా ఇప్పటి వరకు చెప్పలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

