భారతీయ నిపుణులతో అమెరికాకు గొప్ప లాభం: ఎలాన్ మస్క్
అనేక సంవత్సరాలుగా భారతీయ ప్రతిభావంతులను నియమించుకుంటూ అమెరికా అత్యధిక లబ్ధిని పొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘పాడ్‌కాస్ట్‌లో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- హెచ్-1బీ వీసా వివాదంపై ఎలాన్ మస్క్ వ్యాఖ్య
వాషింగ్టన్: అనేక సంవత్సరాలుగా భారతీయ (Indians) ప్రతిభావంతులను నియమించుకుంటూ అమెరికా అత్యధిక లబ్ధిని పొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘పాడ్‌కాస్ట్‌లో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసా (H-1B visa) ప్రోగ్రామ్ గతంలో దుర్వినియోగమైనందువల్ల, గత ప్రభుత్వాలు అత్యంత ఉదాసీనంగా వ్యవహరించినందువల్ల అమెరికాలో వలసలకు వ్యతిరేక భావాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో సరిహద్దుల్లో ఎటువంటి నియంత్రణ ఉండేది కాదని, అందరూ స్వేచ్ఛగా అమెరికాకు వచ్చేవారని చెప్పారు. సరిహద్దుల్లో నియంత్రణ లేకపోతే, అది దేశమే కాదన్నారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చారన్నారు.
ఇది కొంత వరకు నెగెటివ్ సెలక్షన్ ఎఫెక్ట్ అని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే భావనలో వాస్తవమెంతో కచ్చితంగా చెప్పలేనన్నారు. ప్రతిభావంతుల కొరత ఉందనేది తన ప్రత్యక్ష పరిశీలన అని చెప్పారు. సంక్లిష్టమైన పనులను చేయడానికి ప్రతిభావంతులను నియమించుకోవలసి ఉంటుందని తెలిపారు. స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ వంటి టాప్ యూఎస్ కంపెనీల చీఫ్‌గా తాను ప్రతిభావంతుల కోసమే చూస్తానని, వారికి సగటు కన్నా ఎక్కువ వేతనాలు చెల్లిస్తానని చెప్పారు.
హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను కొనసాగిస్తూ, దాని దుర్వినియోగాన్ని అరికట్టాలని తెలిపారు. అమెరికాలో పని చేయాలనే ఆకాంక్ష గల భారతీయులకు ఇచ్చిన సందేశంలో, “తీసుకున్నదాని కన్నా ఎక్కువ పని చేసే వారిని నేను గౌరవిస్తాను. తీసుకునే దాని కన్నా సమాజానికి ఎక్కువ ఇచ్చే వారిగా ఉండండి. ఇన్పుట్ కన్నా ఔట్పుట్ ఎక్కువ విలువైనదిగా ఉండటంపై దృష్టి పెట్టండి” అని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

