ఆ ఉద్యోగుల లిస్ట్ సిద్ధం చేయండి.. ట్విట్టర్ మేనేజర్లను ఆదేశించిన ఎలాన్ మస్క్
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా
న్యూయార్క్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా సిద్ధం చేయాలని సంస్థ మేనేజర్లను ఆదేశించారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన వెంటనే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్, లీగల్ పాలసీ ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల అధిపతులను మస్క్ తొలగించారు. ఇక కంపెనీలో పనిచేస్తున్న 7,500 మంది ఉద్యోగులలో దాదాపు 75 శాతం మందిని వదిలించుకోవాలని యోచిస్తున్నట్లు అమెరికా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 1లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని చూస్తున్నారని వెల్లడించారు.
కాగా, ఉద్యోగుల తొలగింపుపై జరిగిన ప్రచారాన్ని మస్క్ ఇప్పటికే తోసిపుచ్చారు. తానొస్తే 75 శాతం ఉద్యోగాలను తీసేస్తానంటూ జరుగుతున్న ప్రచారం కరెక్టు కాదని, అలాంటి ఆలోచన లేదని ఆయన ఉద్యోగులతో అన్నట్లు తెలుస్తున్నది. అయితే ట్విట్టర్ ప్రస్తుత మేనేజ్మెంట్ 2023 చివరి నాటికి కంపెనీ పేరోల్ (వేతనాల మొత్తం)ను సుమారు 800 మిలియన్ డాలర్లకు తగ్గించాలని అనుకుంటున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ తాజా నివేదికలు వెల్లడించాయి. అంటే దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తుందన్నమాట.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

