Venezuela Earthquake : వెనెజువెలా (Venezuela) లో గత నెల 24న సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquakes) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విలయంలో ఇప్పటివరకు నాలుగు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక ఈ భూకంపాల ధాటికి మరో 16,740 మంది గాయపడగా.. భవన శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. ఇంకా చాలామంది జాడ తెలియరాలేదు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు శుక్రవారం కారకాస్‌లో 3.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దాంతో అధికారులు స్థానికంగా ఉన్న భవనాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు దేశంలో కొనసాగుతున్న భూకంప సహాయక చర్యల కోసం యూకే ఆంక్షల కింద విదేశాలలో స్తంభింపజేసిన సుమారు 30 టన్నుల వెనెజువెలా బంగారాన్ని విడుదల చేయాలని కింగ్ చార్లెస్ IIIని కోరినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ చెప్పారు.