Myanmar | మయన్మార్‌లో స్వల్ప భూకంపం.. 4.5 తీవ్రత
మయన్మార్‌లో (Myanmar) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని వెల్లడించింది.
నేపిడా: మయన్మార్‌లో (Myanmar) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. అయితే పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
An earthquake with a magnitude of 4.5 on the Richter Scale hit Myanmar today at 8:15 am: National Centre for Seismology pic.twitter.com/3URPSdvmeF
— ANI (@ANI) May 22, 2023
ఉత్తర కాలిఫోర్నియాలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్రామీణ హంబోల్ట్ కౌంటీ పెట్రోలియాకు పశ్చిమాన 108 కిలోమీటర్లు దూరంలో భూకంపం వచ్చిందని యూఎస్జీస్ వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది.
Notable quake, preliminary info: M 5.5 – 108km W of Petrolia, CA https://t.co/62yIRxk39V
— USGS Earthquakes (@USGS_Quakes) May 21, 2023
కాగా, రెండు రోజుల క్రితం పసిఫిక్ మహాసముద్రం ( Pacific Ocean) ఆగ్నేయ ప్రాంతంలో వరుసగా భూకంపాలు (Earthquake) వచ్చాయి. ఈ నెల 19న న్యూ కలెడోనియాకు (New Caledonian) తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మరుసటి రోజే అంటే మే 20న ఉదయం అదే ప్రాంతంలో 7.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. సముద్ర ఉపరితలానికి 35 కిలోమీటర్ల లోతులో, న్యూ కలెడోనియన్ ద్వీపసమూహానికి తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించినట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. దీంతో సమీపంలోని వనౌతు, ఫిజీ, న్యూకలెడోనియా, కిరిబాటి, వాలిస్, ఫుటునా వంటి ద్వీప దేశాలకు సునామీ (Tsunami) పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

