టర్కీ, సిరియాలో భూకంపం.. 300 దాటిన మృతుల సంఖ్య
Earthquake in Syria, Turkey:టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. సుమారు 300 మందికిపైగా మరణించారు. రెండు వేల మందికిపైగా గాయపడ్డారు.
ఇస్తాంబుల్: సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సిరియాలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రదేశాల్లో భారీ సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి. అలెప్పొ, లటాకియా, హమా, టార్టస్ ప్రాంతాల్లో సుమారు 237 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. టర్కీ కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటికే అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న సిరియాలో తాజా భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది.దాదాపు రెండు వేల మంది గాయపడ్డారు.
రాత్రి పూట భూకంపం సంభవించడం వల్ల మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు భవనాలు నేలమట్టం అయ్యాయి. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లక్షల సంఖ్యలో శరణార్ధులు ఉన్న ప్రాంతంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
తొలుత 7.8 తీవ్రతతో టర్కీలో భూకంపం నమోదు అయ్యింది. ఆ తర్వాత 15 నిమిషాలకు 6.7 తీవ్రతతో మరో ప్రకంపన నమోదు అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గత శతాబ్ధంలో నమోదు అయిన అత్యంత శక్తివంతమైన భూకంపం అని నిపుణులు పేర్కొన్నారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రజలు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయిప్ ఎర్డగోన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

