Russia Earthquake | రష్యా తీరంలో భారీ భూకంపం.. జపాన్, అలాస్కాకు సునామీ హెచ్చరిక
Russia Earthquake | రష్యాను భారీ భూకంపం వణికించింది. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌క తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 8.0గా రిక్టర్ స్కేలుపై తొలుత నమోదైందని అమెరికా జాతీయ సునామీ కేంద్రం తెలిపింది.
Russia Earthquake | రష్యాను భారీ భూకంపం కుదిపివేసింది. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌క తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 8.0గా రిక్టర్ స్కేలుపై తొలుత నమోదైందని అమెరికా జాతీయ సునామీ కేంద్రం తెలిపింది. తర్వాత దాన్ని 8.7గా సవరించింది. ఈ భూకంపం కారణంగా రష్యాలోని కంచట్కా ప్రాంతంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
కంచట్కాలో వచ్చిన భూకంపం నేపథ్యంలో అమెరికా, జపాన్ తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలస్కా, హవాయి ద్వీపాలను కలుపుకుని పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఒక మీటర్ ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించింది. తర్వాత దాన్ని మూడు మీటర్లుగా సవరించింది. పలుమార్లు సునామీలు వచ్చే అవకాశం ఉందని.. హెచ్చరికలు ఎత్తివేసే వరకు సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

