వారంపాటు పనిచేసి అలసిపోయారా? వారాంతాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థంకావడం లేదా? అయితే, ఈ బాతును చూసి నేర్చుకోండి. పూలతో నిండిన చెరువులో ఈత కొడుతూ.. ఎంత ప్రశాంతంగా గడుపుతున్నదో చూడండి. ఈ ఆహ్లాదకరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘యోద ఫర్ ఎవర్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ బాతు జపనీస్ చెర్రీ లేదా సాకురా అని పిలిచే చెర్రీ ఫ్లాసమ్ పువ్వుల అందమైన రేకులతో కప్పబడిన చెరువు లో ప్రశాంతంగా ఈత కొడుతున్నది. ఇది తన కోసం ఒక మార్గాన్ని ఏర్పరుచుకుంటూ మధ్యలో నుంచి పువ్వులను దాటుతున్న దృశ్యం నిజంగా ఉత్కంఠభరితంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను ఇప్పటివరకూ 48వేల మంది లైక్ చేశారు. తాము కూడా వీకెండ్లో బాతులా రిలాక్స్‌గా ఉండాలనుకుంటున్నామని నెటిజన్లు కామెంట్ చేశారు.
Duck swimming through a pond full of cherry blossom leaves..🦆🍂🍁😍 pic.twitter.com/AJ5UsfzVXH
— 𝕐o̴g̴ (@Yoda4ever) June 28, 2022