Viral | సౌత్ కొరియాలోని సియోల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ (SBS) క్యాన్సర్ వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులను జయించిన 20 నుంచి 30 ఏండ్ల వయసు వారి కోసం ఒక డేటింగ్ రియాలిటీ షోను ప్రసారం చేసింది. ‘లవ్ ఎగైనెస్ట్ టైమ్’ పేరుతో రూపొందించిన ఈ షోలో ప్రాణాంతక వ్యాధుల కారణంగా ప్రేమకు దూరంగా ఉన్న ఎనిమిది యువతీయువకులు పాల్గొన్నారు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న వీరు జీవితంలో అత్యంత విలువైనది ఏది, ఎలాంటి ప్రేమ కావాలనుకుంటున్నారు వంటి ప్రశ్నలపై వారి అభిప్రాయాలను పంచుకునేలా ఈ షోను రూపొందించారు.
ఈ షో లోని నైతికతకు సంబంధించిన విషయంపై మొదట్లో చర్చకు దారితీసింది. కానీ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాధారణ డేటింగ్ షోలను కోరుకునేవారు ఈ షోను పట్టించుకోరని విమర్శలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం రెండు ఎపిసోడ్లు ప్రసారం కాగానే కొరియన్ టాప్ 10 సిరీస్‌లో 7వ స్థానంలో నిలిచింది ఈ షో. ప్రాణాంతక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న తర్వాత ప్రేమ, జీవితాన్ని నిజాయితీగా చూపించినందుకు చైనీయులు కూడా ఈ షో విపరీతంగా ఆకట్టుకుంటుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) సోమవారం వెల్లడించింది.

Contastants
తీవ్ర రోగాల నుంచి బయటపడిన, ప్రస్తుతం వాటిని ఎదుర్కొంటూ సింగిల్‌గా ఉంటున్న యువతీయుకులను చూపించడం సాధారణ డేటింగ్ రియాలిటీ షోలకు భిన్నంగా ఉంది. అంతేకాదు ఆరోగ్యమైన సవాళ్లు సంబంధాలను, అర్థం చేసుకునే అనుబంధాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈ షో తెలియజేస్తుంది. కిమ్ జోంగ్ యూన్ (Kim Jong Eun) అనే యువకుడు అగ్నిమాపక దళంలో ఉద్యోగం చేయాలనేది కల. ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా ఉన్నట్లు బయటపడింది. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తర్వాత కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాని చెప్పాడు. దానంగా పొందిన రోగనిరోధక కణాలు అతని ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేయడంతో ఊపిరితిత్తులు, కీళ్లు, వేళ్ల కణుపుల తీరు క్షీణించిందని వెల్లడించాడు. కిమ్ నా యంగ్ అనే యువతి తన ఎడమ చెవి వినిడికి శక్తిని కోల్పోయానని వెల్లడించింది. దీనికి సంబంధించిన అకౌస్టిక్ న్యూరోమా చికిత్స పొందుతున్నప్పుడు నెలలో 20 కిలోల బరువు పెరగడంతో చేయాలనుకున్న ఏ పనీ చేయలేకపోయాయని తెలిపింది. ఇకపై నా మనసు చెప్పినట్టు ప్రేమించడం, పని చేయడం, ఆనందించడం వంటి చేస్తానని. నా అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పింది. వారి ఈ భావోద్వేగ కథనాలు వీక్షకుల హృదయాలను హత్తుకున్నాయి.
ఈ షోపై సోషల్ మీడియా (Social Media)లో ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిలో పాల్గొనేవారు జాలిని కోరుకోరు, వారు జీవితం పట్ల ఆశతో, భాగస్వామిలో ఏది ముఖ్యమో అనే స్పష్టమైన అవగాహనతో డేటింగ్ ప్రారంభిస్తారని వీక్షకులు తెలుపుతున్నారు. తీవ్రమైన నొప్పి, బాధలను భరించినవారు ధైర్యంగా ముందుకువచ్చి తమ ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటాన్ని చూపించిన ఈ కార్యక్రమం ఎంతగానో కదిలించిందని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన ప్రేమకు అర్హులు కారు అనేది వాస్తవం కాదు, ప్రేమ శారీరక రుగ్మతలను అధిగమిస్తుంది, రెండు మనసులను కలుపుతుంది అని మరో వ్యక్తి పేర్కొన్నారు.

Dating Reality Show
ఈ షోకు సంబంధించిన మూలకథ తన సహోద్యోగులు, ఒక పరిచయస్తురాలి ద్వారా పుట్టిందని ‘లవ్ ఎగైనెస్ట్ టైమ్’ షోకు నిర్మాత, దర్శకుడు అయిన లీ యూన్ సోల్ (Lee Eun Sol) ఎస్బీఎస్ కార్యాలయ ప్రతినిధులకు వెల్లడించారు. ఒకరిని ఇష్టపడటం అంటే సమయాన్ని వెచ్చించడమే అనేది మా సహోద్యోగుల నమ్మకం. కానీ దీనికి భిన్నంగా తెలిసిన ఒకామె పంచుకున్న తన అనుభవం ఈ కార్యక్రమానికి నాంది పడింది అని తెలిపారు. నేను అనారోగ్యానికి గురైన తరువాత డేటింగ్ చేయడం కష్టమైంది. ఈ అనారోగ్య సమస్యలను ఎప్పుడు బయటపెట్టాలా అనే ఆందోళనలో ఉంటాను. కాబట్టి నాలాంటి వ్యక్తులతో డేటింగ్ షో చేస్తే భిన్నంగా ఉండటంతో పాటు ఆతృతగా చూస్తారని ఆమె వెల్లడించిందని లీ యూన్ సోల్ పేర్కొన్నారు.