పాకిస్థాన్‌లోని భారత ఎంబసీ వద్ద డ్రోన్ కలకలం..

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. హై కమిషన్ ఆఫీసు కాంపౌండ్‌లో డ్రోన సంచరించినట్లు గుర్తించారు. ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజుల నుంచి కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు విహరిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్లో ఉన్న ఓ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పైన కూడా డ్రోన్ దాడి జరిగింది. గత ఆదివారం ఎయిర్‌బేస్‌పై జరిగిన డ్రోన్ దాడిలో పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థలు జేషే మొహమ్మద్, లష్కరే తోయిబాల హస్తం ఉన్నట్లు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పాండే తెలిపారు.
జూన్ 26వ తేదీన భారతీయ ఎంబసీ వద్ద ఉన్న రెసిడెన్షియల్ ప్రాంతంలో డ్రోన్ కనిపించినట్లు తెలుస్తోంది. అదే రోజున జమ్మూలోని ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డ్రోన్లను భద్రతా దళాలు గుర్తించాయి. పాక్ ఉగ్రవాదులు డ్రోన్లు వాడుతున్న విషయం గురించి ఐక్యరాజ్యసమితిలో ఇండియా తన నిరసన వ్యక్తం చేసింది. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా కోసం పాక్ ఉగ్రవాదులు డ్రోన్లు వాడుతున్నట్లు భారతీయ భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

