Hindu doctor Murder | పాకిస్థాన్‌లో మరో దారుణం.. హిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్
Hindu doctor Murder | డాక్టర్ ధరమ్ దేవ్ రాతి స్థానికంగా ప్రసిద్ధి చెందిన చర్మవ్యాధుల వైద్యుడు. మంగళవారం కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనకు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి చేరిన వెంటనే కారు డ్రైవర్ కిచెన్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కత్తిని తీసుకుని ఆ డాక్టర్‌పై దాడి చేశాడు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మరో దారుణం వెలుగుచూసింది. హిందూ డాక్టర్‌పై కారు డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. ఆయన గొంతు కోసి హత్య చేశాడు. (Hindu doctor Murder) పాకిస్థాన్ సింధు ప్రావిన్స్‌లోని హైదరాబాద్ నగరంలో ఈ సంఘటన జరిగింది. డాక్టర్ ధరమ్ దేవ్ రాతి స్థానికంగా ప్రసిద్ధి చెందిన చర్మవ్యాధుల వైద్యుడు. మంగళవారం కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనకు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి చేరిన వెంటనే కారు డ్రైవర్ కిచెన్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కత్తిని తీసుకుని ఆ డాక్టర్‌పై దాడి చేశాడు. ధరమ్ దేవ్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం డాక్టర్‌కు చెందిన కారులో అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, కిచెన్‌లో ఉన్న వంట వ్యక్తి ఇది చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితుడైన కారు డ్రైవర్‌ను హనీఫ్ లెఘారీగా గుర్తించారు. ఖైర్పూర్లోని అతడి ఇంట్లో బుధవారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి జియాన్ చంద్ ఎస్సారానీ ఈ సంఘటనను ఖండించారు. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసులను ప్రశంసించారు. బాధిత హిందూ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మహిళా విభాగం చీఫ్ ఫర్యాల్ తల్పూర్ కూడా హిందూ డాక్టర్ హత్యను ఖండించారు. పాకిస్థాన్‌లోని హిందువులు హోలీ వేడుక జరుపుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరుగడం బాధాకరమని అన్నారు. హిందూ డాక్టర్ ధరమ్ దేవ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.
China | జనాభా పెంచేందుకు చైనా తిప్పలు.. పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కనేందుకు అవకాశం..!
NASA – ISRO satellite | నాసా-ఇస్రో శాటిలైట్ త్వరలో లాంచ్.. అమెరికా నుంచి భారత్‌కు తరలింపు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

