మనుషులకే కాదు.. జంతువులు, పశుపక్ష్యాదులకూ ప్రేమానురాగాలుంటాయి. అవి విభిన్న తరహాలో ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. ఇది అవసరం కూడా. కాగా, ఇదే విషయాన్ని తెలియజేసింది ఓ సీల్ ప్రేమజంట. నీటిలో ఓ సీల్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి పూలిచ్చి తన ప్రేమను తెలియజేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను క్రియేచర్నేచర్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఓ స్విమ్మింగ్ పూల్‌లో రెండు సీల్ చేపలున్నాయి. అందులో మగ సీల్ తులిప్ పూలను తీసుకొచ్చి ఆడ సీల్‌కు ఇచ్చింది. పూలు తీసుకున్న ఆడ సీల్ చేప ఆనందంగా పూల్‌లో చక్కర్లు కొట్టింది. ఈ హృదయపూర్వక వీడియో నెటిజన్లను ఆకట్టుకున్నది. ఈ వీడియోను ఇప్పటివరకూ 5వేల మంది చూడగా, వందమంది రీట్వీట్ చేశారు.
He gave her flowers…and she couldn’t be any happier. 😁💐🦭 pic.twitter.com/u9Gfbz8iDO
— Creature Nature (@CreatureNature_) June 20, 2022