Rishi Sunak | బ్రిటన్ పార్లమెంటుకు 4న ఎన్నికలు.. రిషి సునాక్ ఏమన్నారంటే..!
Rishi Sunak | గురువారం బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం రిషి సునాక్ మాట్లాడుతూ.. ఓటర్లు పశ్చత్తాప పడే పని చేయొద్దని కోరారు.
Rishi Sunak | ఓటర్లు పశ్చాత్తాప పడే పనులు చేయొద్దని బ్రిటన్ ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ సూచించారు. ఈ నెల నాలుగో తేదీన బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజు మంగళవారం పలు ప్రాంతాల్లో రిషి సునాక్ సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని మెజారిటీ సర్వేలు చెబుతుండటంతో రిషి సునాక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
‘సర్వేలను విశ్వసించి లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తే దేశంపై పన్నుల భారం తప్పదు. ఇదే పదవిలో నేను కొనసాగడం ద్వారా ప్రజల పన్నులు, వారి పెన్షన్లు, సరిహద్దులను రక్షిస్తా. గురువారం మీరు తీసుకునే నిర్ణయం మళ్లీ వెనక్కి రాదు. పశ్చాత్తాప పడే పని చేయొద్దు’ అని రిషి సునాక్ చెప్పారు. తాజా సర్వేల అంచనాలతో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఉత్సాహంగా ఉన్నారు. అయితే తమకు ప్రతి ఓటూ ముఖ్యమేనన్నారు. ఇప్పటికే దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని ఆరోపించారు. తాము ఒకవేళ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వానికి అన్నీ సవాళ్లే ఉంటాయన్నారు. గత 14 ఏండ్లుగా ఏ పురోగతి లేదన్నారు.
ఇవి కూడా చదవండి :
Electricity Bills | ఇక ఆ సిస్టమ్‌తోనే ఎలక్ట్రిసిటీ బిల్లులు పేమెంట్స్.. ఎందుకంటే..?
Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Coca-Cola | భారత్ మార్కెట్‌కు కోకా కోలా గుడ్‌బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

