Stormy Daniels: ట్రంప్‌కు జైలుశిక్ష అవసరం లేదు: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్
Stormy Daniels: జైలు శిక్షకు ట్రంప్ అర్హుడు కాదు అని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో ట్రంప్‌పై 34 నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే.
న్యూయార్క్: హష్ మనీ(Hush Money) కేసులో మన్‌హట్టన్ కోర్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కేసులో తొలుత సరెండర్ అయి, ఆ తర్వాత ఆయన విడుదలైన విషయం కూడా తెలిసిందే. ట్రంప్(Donald Trump)పై మొత్తం 34 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అయితే ఆ కేసుల్లో ట్రంప్‌కు జైలుశిక్ష పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్(Stormy Daniels) ఓ మీడియాతో మాట్లాడారు.
ట్రంప్‌పై ఉన్న నేరాభియోగాల(Criminal Charges) విషయంలో ఆయనకు జైలు శిక్ష పడాల్సిన అవసరం లేదని స్టార్మీ తెలిపారు. తనకు జరిగిన పేమెంట్ అంశంలో ట్రంప్ జైలు శిక్ష(Prison)కు అర్హుడు కాదని ఆమె అన్నారు. తన పట్ల ట్రంప్ పాల్పడిన నేరం జైలుశిక్షకు తగినది కాదని ఆమె తెలిపారు. పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చే విషయంలో వ్యాపార రికార్డులను తారుమారు చేసినట్లు ట్రంప్‌పై కేసు నమోదు అయ్యింది. ఆ కేసుతో లింకు ఉన్న 34 నేరాభియోగాలను ఆయనపై మోపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

