Donald Trump | బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు.. ఖండించిన ట్రంప్
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్తో, ప్రధాని మోదీతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని వెల్లడించారు.
న్యూయార్క్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్తో, ప్రధాని మోదీతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని వెల్లడించారు. దీపావళి పండుగ నేపథ్యంలో సోషల్మీడియా వేదికగా పోస్టు చేసిన ఆయన హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అమెరికాతోపాటు, ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు.
బంగ్లాలో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. అల్లరి మూకలు హిందువుల ఇండ్లు, దుకాణాలను దోపిడీ చేశారని తెలిపారు. దీంతో ఆ దేశంలో తీవ్రమైన భయానక గందరగోళ పరిస్థితులు తలెత్తాయన్నారు. తన పాలనా సమయంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్లు విస్మరించారని విమర్శించారు. ఇజ్రాయెల్ నుంచి మొదలుకొని, ఉక్రెయిన్, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఎన్నో ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేసి శాంతిని నెలకొల్పుతామని చెప్పారు.
రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ వెల్లడించారు. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతామన్నారు. తన పరిపాలనతో ఇండియాతోపాటు తన స్నేహితుడు, ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామని తెలిపారు. కమలా హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తుందని, తాను విజయం సాధించినట్లయితే పన్నులు, నిబంధనల్లో కొత విధిస్తానని వెల్లడించారు. అమెరికాను అత్యంత శక్తిమంతగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతానని, మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతానని వెల్లడించారు. దీపావళి పండుగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నానని ట్రంప్ అన్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

