డబ్లిన్, మే 1: ఈ ప్రపంచంలో కుక్కకు ఉన్న విశ్వాసం మరే జంతువుకూ ఉండదంటారు. దానికి ప్రతక్ష్య ఉదాహరణే కూపర్ అనే గోల్డెన్ రిట్రీవర్ డాగ్. పాత యజమానిపై ప్రేమతో కొత్త యజమాని నుంచి తప్పించుకొన్నది. ఏకంగా 27 రోజులు.. 64 కిలో మీటర్లు అలుపెరగకుండా.. ఒంటరిగా ప్రయాణించి తనను అమ్మేసిన పాత యజమాని ఇంటికి చేరుకొన్నది.
ఏండ్లుగా తనతో ఉన్న కూపర్‌ను పాత యజమాని అమ్మేశాడు. అయితే, పాత యజమానితో ఎంతో అనుబంధం ఉన్న కూపర్ ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌లోని కొత్త ఇంటికి చేరుకోగానే కారులోంచి దూకేసింది. పాత యజమాని ఇంటి బాటపట్టింది. 27 రోజుల తర్వాత పాత యజమాని ఇంటికి చేరుకొన్నది.