55 బ్యాటరీలు మింగిన మహిళ… ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
కడుపులో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడిన ఆ మహిళను డబ్లిన్‌లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే తీయగా ఆమె పొత్తి కడుపు, పేగుల్లో చిన్న సైజు బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు.
డబ్లిన్: ఒక మహిళ ఏకంగా 55 బ్యాటరీలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అవి ఆమె కడుపు, పేగుల్లో చిక్కుకున్నాయి. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బ్యాటరీలను తొలగించారు. ఇంత పెద్ద సంఖ్యలో బ్యాటరీలను సర్జరీ ద్వారా తొలగించడం ఇదే తొలిసారి అని డాక్టర్లు తెలిపారు. ఐర్లాండ్ దేశంలో ఈ సంఘటన జరిగింది. 66 ఏళ్ల మహిళ తనకు తాను హాని తలపెట్టుకోవాలని భావించింది. ఏఏ, ఏఏఏ సైజు బ్యాటరీలు 55 మింగింది. అవన్నీ ఆమె కడుపులో, పెద్ద, చిన్న పేగుల్లో ఇరుక్కున్నాయి.
కాగా, కడుపులో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడిన ఆ మహిళను డబ్లిన్‌లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే తీయగా ఆమె పొత్తి కడుపు, పేగుల్లో చిన్న సైజు బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే అదృష్టవశాత్తు ఆ బ్యాటరీల వల్ల ఆమె జీర్ణకోశం దెబ్బతినలేదని వైద్యులు చెప్పారు.

పొత్తు కడుపు వద్ద సర్జరీ చేసిన వైద్యులు తొలుత 46 బ్యాటరీలు తొలగించారు. పెద్ద పేగు, చిన్న పేగుల్లో ఇరుకున్న బ్యాటరీలను ఇతర వైద్య విధానాల ద్వారా బయటకు తీశారు. అయితే ఒకేసారి ఇన్ని బ్యాటరీలు మింగిన సంఘటన ఇదేనని ఆ వైద్యులు తెలిపారు. ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ఈ నివేదికను గురువారం ప్రచురించినట్లు సైన్స్ అలెర్ట్ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

