Walking | వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.. అయితే రోజుకు ఎన్ని అడుగులు నడవాలంటే?
ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే రోజుకు ఎంత సేపు నడవాలి? ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అనే అనుమానాలు మాత్రం చాలామందికి ఉంటాయి.
Walking | సిడ్నీ, మార్చి 7: ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే రోజుకు ఎంత సేపు నడవాలి? ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అనే అనుమానాలు మాత్రం చాలామందికి ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనం ఈ అనుమానాలను తీర్చింది.
ప్రతిరోజూ 2,200 అడుగుల తర్వాత వేసే ప్రతి అడుగు వల్ల ఆరోగ్యానికి ఎంతోకొంత మేలు జరుగుతుందని, ముఖ్యంగా గుండెజబ్బులు, అకాల మరణ ముప్పు తగ్గుతున్నదని వీరు గుర్తించారు. రోజుకు 9,000 నుంచి 10,000 అడుగులు నడిచే వారిలో గుండెజబ్బుల ముప్పు 21 శాతం తక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. రోజుకు 9,000 నుంచి 10,500 అడుగులు నడిచే వారిలో అకాల మరణం సంభవించే ముప్పు 39 శాతం తగ్గుతున్నట్టు గుర్తించారు. వాకింగ్ చేసిన తర్వాత మిగతా రోజంతా ఎలాంటి శారీరక శ్రమ చేయని వారిలోనూ ఈ ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధకులు చెప్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

