ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తిగా నిలిపేసిన యురోపియన్ దేశం

కోపెన్‌హాగెన్: ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ వినియోగాన్ని యురోపియన్ దేశం డెన్మార్క్ పూర్తిగా నిలిపేసింది. దీంతో ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది. ఈ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన, తీవ్రమైన సైడ్ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఆ దేశం చెప్పింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ లేకుండానే డెన్మార్క్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ వెల్లడించారు.
ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యురోపియన్ డ్రగ్ కంట్రోలర్ చెప్పినా కూడా డెన్మార్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్లేట్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటం, వ్యాక్సిన్‌కు మధ్య క్రాస్ రియాక్షన్ ఉన్నట్లు బ్రోస్ట్రోమ్ చెప్పారు. టీకా వినియోగాన్ని నిలిపేయాలన్న నిర్ణయం సందర్భోచితం అని ఆయన స్పష్టం చేశారు. డెన్మార్క్‌లో ఇప్పటికే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న అందరికీ వ్యాక్సిన్లు వేశామని, కరోనా నియంత్రణలోనే ఉన్నదని తెలిపారు.
ఆస్ట్రాజెనెకా వల్ల రక్తం గడ్డ కడుతోందన్న ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే చాలా యురోపియన్ దేశాలు 60 ఏళ్ల లోపు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మానేశాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ చెప్పిన తర్వాత తిరిగి ఇస్తున్నాయి. డెన్మార్క్ మాత్రం సొంతంగా విచారణ జరిపి ఆస్ట్రాజెనెనాకు వాడకూడదని నిర్ణయించింది. ఫైజర్, మోడెర్నా టీకాలనే ఇక నుంచి డెన్మార్క్ ఉపయోగించనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

