ఇరాన్లో మిన్నంటిన హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు.. 50 మంది మృతి
Hijab | ఇరాన్లో హిజాబ్ (Hijab) వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిజబ్ ధరించలేదన్న కారణంతో
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ (Hijab) వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిజబ్ ధరించలేదన్న కారణంతో మాసా అమీని అనే 22 ఏండ్ల యువతిని టెహ్రాన్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కస్టడీలో తీవ్రంగా గాయపడిన ఆమె.. దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. పోలీసులు చిత్రహింసలతోనే మాసా అమీని మరణించిందని ప్రజలు రోడ్లపైకి వచ్చి హిజబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. క్రమంగా ఇవి దేశంలోని 80 పట్టణాలు, నగరాలకు విస్తరించాయి.
అయితే మహిళల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలను ప్రయోగించి ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన అణిచివేతలో ఇప్పటివరకు కనీసం 50 మంది పౌరులు మరణించారని ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. అయితే ప్రభుత్వం 17 మంది మాత్రమే చనిపోయారి చెబుతున్నదని, కానీ దానికి మూడు రెట్లు అధికంగా మరణాలు ఉన్నాయని తెలిపింది. ఇందులో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- hijab
- iran
- Mahsa Amini
- Protests
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

