సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Jan 29, 2020 , 11:58:16

మంత్రం పఠిస్తే.. కరోనా రాదు!

మంత్రం పఠిస్తే.. కరోనా రాదు!
  • భక్తులకు సూచించిన ఆధ్యాత్మిక గురువు దలైలామా

ధర్మశాల: ప్రాణాం తక కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రా లు పఠించాలని చైనాలోని తన అనుచరులకు టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా సూచించారు. చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ వల్ల ఆ దేశంలో ఇప్పటివరకూ 106 మంది చనిపోగా వేల మంది దాని బారిన పడ్డారు. దీంతో చైనాలోని కొందరు భక్తులు.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సలహా ఇవ్వాలని ఫేస్‌బుక్‌ వేదికగా దలైలామాను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘తారా మంత్రం’ పఠించాలని సూచించారు. ‘వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ మంత్రం సాయపడుతుంది’ అని చెప్పారు. ‘ఓం తారే తుత్తారే తురే సోహా’ అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను కూడా తన పోస్టుకు దలైలామా జతచేశారు.


logo